Skip to main content

జిన్‌పింగ్‌తో ఇమ్రాన్‌ఖాన్ భేటీ

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ భేటీ అయ్యారు.
చైనా రాజధాని బీజింగ్‌లో ఏప్రిల్ 28న జరిగిన ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చలుజరిపారు. ప్రస్తుతం నిర్మాణదశలో వున్న చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ తదుపరి దశపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. బీజింగ్‌లో జరుగుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ సదస్సులో పాల్గనేందుకు నాలుగు రోజుల అధికార పర్యటన నిమిత్తం ఇమ్రాన్ చైనా వెళ్లిన విషయం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో పాకిస్తాన్ ప్రధాని భేటీ
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : ఇమ్రాన్‌ఖాన్
ఎక్కడ : గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్, బీజింగ్, చైనా
Published date : 30 Apr 2019 05:11PM

Photo Stories