Skip to main content

జిన్‌పింగ్, పుతిన్‌లతో మోదీ భేటీ

కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జూన్ 13న ప్రారంభమైన షాంఘై సహకార సదస్సు(ఎస్‌సీవో)కు ప్రధాని మోదీ హాజరయ్యారు.
ఈ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ వేర్వేరుగా సమావేశమయ్యారు. జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా భారత్-చైనాల మధ్య వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై చర్చించామని మోదీ తెలిపారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న విషయాన్ని మోదీ జిన్‌పింగ్ దృష్టికి తీసుకొచ్చారు.

ఎస్‌సీవో సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా భారత్-రష్యాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను పటిష్టం చేసుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయించారు. బిష్కెక్‌లో ఎస్‌సీవో భేటీ జూన్ 13 నుంచి రెండ్రోజుల పాటు సాగనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో వేర్వేరుగా భేటీ
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బిష్కెక్, కిర్గిస్థాన్
Published date : 14 Jun 2019 05:33PM

Photo Stories