జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికైన సంస్థ?
Sakshi Education
జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు-2021కు.. వ్యాక్సిన్ పరిశోధనలు, ఉత్పత్తి రంగాల్లో అత్యున్నత స్థాయిలో కృషి చేస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ ఎంపికైంది.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో జరిగే ‘బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు’లో భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్రా ఎల్లా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. జీవశాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులు/సంస్థలకు ఏటా ఈ అవార్డును అందిస్తున్న విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు-2021కు ఎంపికైన సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ
ఎందుకు : జీవశాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు-2021కు ఎంపికైన సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ
ఎందుకు : జీవశాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు
Published date : 17 Feb 2021 05:56PM