జీవితకాల గరిష్టానికి విదేశీ మారకపు నిల్వలు
Sakshi Education
భారత విదేశీ మారకపు నిల్వలు(ఫారెక్స్ నిల్వలు) 2020, డిసెంబర్ 4తో ముగిసిన వారం నాటికి జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి.
ఫారెక్స్ నిల్వలు 469 మిలియన్లు పెరిగి 579.346 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గణాంకాలు తెలిపాయి. అంతకు ముందు నవంబర్ 27తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 574.821 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం...,
- బంగారం నిల్వల విలువ 535 మిలియన్ డాలర్లు పెరిగి 35.728 బిలియన్ డాలర్లకు ఎగసింది.
- అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద భారత్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ స్వల్పంగా 12 మిలియన్ డాలర్లు పెరిగి 1.506 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి..
- ఐఎంఎఫ్ వద్ద నిల్వల స్థితి 46 మిలియన్ డాలర్లు పెరిగి 4.725 బిలియన్ డాలర్లుగా నమోదైంది..
Published date : 12 Dec 2020 06:44PM