జీఎస్‌టీ పరిహార లోటు భర్తీకిగాను రాష్ట్రాల తరఫున కేంద్రం ఎన్ని రూ. కోట్లను సమీకరించనుంది?
Sakshi Education
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కింద రాష్ట్రాలకు ఆదాయలోటును పూడ్చేందుకు కేంద్రప్రభుత్వమే రుణ సమీకరణ చేసేందుకు ముందుకు వచ్చింది.
జీఎస్‌టీ వసూళ్లలో లోటు కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రూ.1.1 లక్షల కోట్లను రాష్ట్రాల తరఫున కేంద్రమే రుణం కింద సమీకరించి వాటికి సర్దుబాటు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 15న ప్రకటించారు. అరుుతే, ఈ రుణాలకు వడ్డీ, అసలు చెల్లింపులు ఎవరు చేస్తారన్న విషయాన్ని మంత్రి ప్రస్తావించలేదు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో జీఎస్‌టీ వసూళ్లు ఆశించిన మేర లేవన్న విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.1.1 లక్షల కోట్ల రుణ సమీకరణ చేయాలని నిర్ణయం
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : జీఎస్‌టీ కింద రాష్ట్రాలకు ఆదాయలోటును పూడ్చేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.1.1 లక్షల కోట్ల రుణ సమీకరణ చేయాలని నిర్ణయం
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : జీఎస్‌టీ కింద రాష్ట్రాలకు ఆదాయలోటును పూడ్చేందుకు
Published date : 16 Oct 2020 06:16PM