Skip to main content

జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 10 రాకెట్‌ ప్రయోగం విఫలం

జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 10 రాకెట్‌ ప్రయోగం విఫలమయ్యింది. మూడో దశలో రాకెట్‌ గతి తప్పింది.
క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో జీఎస్‌ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్‌ ప్రకటించారు.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో జియో సింక్రోనస్‌ లాంచింగ్‌ శాటిలైట్‌ వెహికల్‌(జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–10) ప్రయోగించేందుకు బుధ‌వారం వేకువజామున 3.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. గురువారం ఉదయం 5.43​​​ గంటలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 10 రాకెట్‌ను ప్రయోగించారు. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య రావడంతో ప్రయోగం విఫలమయ్యింది.

దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థకు అనుసంధానం, దేశంలో ఉపద్రవాలు/విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈవోఎస్‌–03 రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని ఉపయోగించాల్సి వుంది. ఈ ఉపగ్రహంలో మల్టీ–స్పెక్ట్రల్‌ విజబుల్‌ అండ్‌ నియర్‌–ఇన్‌ఫ్రారెడ్‌ (6 బాండ్స్‌), హైపర్‌–స్పెక్ట్రల్‌ విజబుల్‌ అండ్‌ నియర్‌–ఇన్‌ఫ్రారెడ్‌ (158 బాండ్స్‌), హైపర్‌–స్పెక్ట్రల్‌ షార్ట్‌ వేవ్‌–ఇన్‌ఫ్రారెడ్‌ (256 బాండ్స్‌) పేలోడ్స్‌గా అమర్చారు. ఈ ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తు నుంచి అత్యంత పవర్‌ఫుల్‌ కెమెరాలతో 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపించేవిధంగా రూపొందించారు. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం విఫలమైంది.
Published date : 12 Aug 2021 06:02PM

Photo Stories