జీడీపీ వృద్ధి 5 శాతం లోపే : ఎన్‌ఎస్‌ఓ
Sakshi Education
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5 శాతం దిగువనే నమోదవుతుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) అంచనా వేసింది.
ఈ మేరకు జనవరి 7న జాతీయ ఆదాయ తొలి ముందస్తు అంచనాలను వెలువరించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదైంది. జీడీపీ వృద్ధిరేటు 5 శాతం దిగువకు పడిపోతే అది 11 సంవత్సరాల కనిష్టస్థాయి అవుతుంది.
తలసరి ఆదాయ వృద్ధి 6.8 శాతం
భారత్ నెలవారీ తలసరి ఆదాయం 2019-20లో 6.8 శాతం పెరిగి రూ.11,254కు చేరుతున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ అంచనావేసింది. 2018-19లో తలసరి ఆదాయం రూ.10,534గా ఉంది. వార్షికంగా చూస్తే, తలసరి ఆదాయం 6.8 శాతం వృద్ధితో రూ. 1,26,406 నుంచి రూ.1,35,050కి పెరుగుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019-20లో భారత జీడీపీ వృద్ధి 5 శాతం లోపే
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ)
మాదిరి ప్రశ్నలు

1. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత వార్షిక తలసరి ఆదాయం ఎంత?
1. రూ. 1,26,406
2. రూ. 1,35,050
3. రూ.11,254
4. రూ.10,534
- View Answer
- సమాధానం : 1
2. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదైంది?
1. 5.1
2. 6.5
3. 6.8
4. 7.2
- View Answer
- సమాధానం : 3
Published date : 08 Jan 2020 05:29PM