జీడీపీ అంచనాలకు ఇండియా రేటింగ్స్ కోత
Sakshi Education
భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) వృద్ధి రేటు అంచనాలకు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ కోత విధించింది.
ఈ మేరకు వృద్ధి రేటును 7.3 శాతం నుంచి 6.7శాతానికి తగ్గిస్తున్నట్లు ఆగస్టు 28న వెల్లడించింది. వినియోగంలో మందగమనం, పారిశ్రామిక ఉత్పత్తి రేటు పడిపోవడం వంటి అంశాలు వృద్ధి రేటు కోతకు కారణమని పేర్కొంది. 2019, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కూడా వృద్ధి రేటు 5.7 శాతంగానే ఉంటుందని అంచనా వేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాలకు కోత
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఇండియా రేటింగ్‌స అండ్ రీసెర్చ్
ఎందుకు : వినియోగంలో మందగమనం, పారిశ్రామిక ఉత్పత్తి రేటు పడిపోవడం వంటి అంశాల కారణంగా

Published date : 29 Aug 2019 05:47PM