జీ–7 దేశాల వార్షిక సదస్సు ఏదేశంలో జరుగుతోంది?
Sakshi Education
సంపన్న దేశాల కూటమి జీ–7 వార్షిక సదస్సుకు 2021 ఏడాది యూకే ఆతిథ్యం ఇస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీ–7 దేశాల వార్షిక సదస్సు ప్రారంభం
ఎప్పుడు :జూన్11
ఎక్కడ : కార్బిస్ బే హోటల్, కార్నవాల్, యూకే
ఎందుకు:కోవిడ్‌పై యుద్ధం, వాతావరణంలో మార్పులు వంటి అంశాలపైచర్చించేందుకు
యూకేలోనికార్నవాల్‌లో ఉన్న కార్బిస్ బే హోటల్‌లో జూన్ 11న ప్రారంభమైన ఈ సదస్సు 13 తేదీ వరకు జరగనుంది.అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ సభ్య దేశాలుగా ఉన్న జీ–7 సదస్సు ఈసారి కోవిడ్‌పై యుద్ధం, వాతావరణంలో మార్పులపైనే ప్రధానంగా చర్చించనుంది.ఈ ఏడాది జీ–7 సదస్సుకి అతిథి దేశాలుగా భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలను ఆహ్వానించారు. 12, 13 తేదీల్లో జరిగే సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.
సదస్సు ఎజెండా...
సదస్సు ఎజెండా...
- కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న సమయంలో బిల్ట్ బ్యాక్ బెటర్ అన్న నినాదంతో సదస్సు జరగనుంది.
- కోవిడ్‌పై పోరాటంతో పాటు భవిష్యత్‌లో వచ్చే మహమ్మారుల్ని ఎదుర్కొనేలా ప్రపంచ దేశాల ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం.
- స్వేచ్ఛా వాణిజ్య విధానానికి ప్రోత్సాహం.
- వాతావరణంలో మార్పుల్ని తట్టుకుంటూ జీవవైవిధ్యాన్ని కాపాడే చర్యలు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీ–7 దేశాల వార్షిక సదస్సు ప్రారంభం
ఎప్పుడు :జూన్11
ఎక్కడ : కార్బిస్ బే హోటల్, కార్నవాల్, యూకే
ఎందుకు:కోవిడ్‌పై యుద్ధం, వాతావరణంలో మార్పులు వంటి అంశాలపైచర్చించేందుకు
Published date : 11 Jun 2021 06:31PM