Skip to main content

జగనన్న విద్యాదీవెన, వసతి పథకాలకు ఆమోదం

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించేందుకు ఉద్దేశించిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది.
Current Affairsఅలాగే ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని కేబినెట్ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27న వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైన మంత్రి మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీటితోపాటు పలు తీర్మానాలను మంత్రిమండలి ఆమోదించింది.

విద్యాదీవెన, వసతి దేవెన
అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించేలా విద్యాదీవెన పథకాన్ని రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులకు పథకాన్ని వర్తింపజేస్తారు. ఈసారి బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ కోర్సులకు పూర్తిస్థాయిలో రీయింబర్స్‌మెంట్ అందజేస్తారు. వసతి దీవెన పథకం ద్వారా అర్హులైన విద్యార్థులందరికీ వసతి, భోజన సదుపాయాల కోసం నగదు చెల్లిస్తారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తారు.

జగనన్న విద్యా దీవెన ద్వారా ఏటా రూ.3,400 కోట్లు, వసతి దీవెన కింద ఏటా రూ.2,300 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా ఈ రెండు పథకాల కోసం ప్రభుత్వం ఏటా రూ.5,700 కోట్లు ఖర్చు చేయనుంది.

కేబినెట్ భేటీలో మరికొన్ని నిర్ణయాలు
  • ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్ సవరణకు ఆమోదం.
  • ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాల స్వీకరణకు ఆమోదం.
  • నడికుడి - శ్రీకాళహస్తి బ్రాడ్ గేజ్ లైన్ నిర్మాణం కోసం దక్షిణ మధ్య రైల్వేకు 92.05 ఎకరాలు ఇచ్చేందుకు ఆమోదం.
  • టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్యను 19 నుంచి 29కి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
  • గిరిజన ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్ లైజన్ వర్కర్ల జీతాల పెంపునకు ఆమోదం. నెలకు కేవలం రూ.400గా ఉన్న వారి జీతాలను రూ.4000కి ప్రభుత్వం పెంచింది.
  • అర్హులందరికీ కొత్తగా బియ్యం కార్డులు జారీ చేసేలా నిబంధనల సడలింపు.
  • రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వేర్వేరుగా కార్డులు జారీకి ఆమోదం.
  • నవరత్నాల ద్వారా పేదలందరికీ ఇళ్ల పథకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనుంది.
Published date : 28 Nov 2019 06:01PM

Photo Stories