జగనన్న జీవ క్రాంతి పథకం ఉద్దేశం?
Sakshi Education
వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా ఎంపికైన మహిళలకు గొర్రెలు, మేకలు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన ‘జగనన్న జీవ క్రాంతి’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.
డిసెంబర్ 10న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి పర్చువల్ విధానంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లాల్లోని లబ్ధిదారులనుద్ధేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
ముఖ్యమంత్రి ప్రసంగం-ముఖ్యాంశాలు
- జీవ క్రాంతి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,869 కోట్ల వ్యయంతో మేలు జాతికి చెందిన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు మూడు దశల్లో పంపిణీ చేస్తున్నాం.
- ఒక్కో యూనిట్‌లో ఐదారు నెలల వయసున్న 14 మేకలు లేదా గొర్రెలు.. ఒక మేకపోతు లేదా పొట్టేలు ఉంటుంది.
- 1,51,671 గొర్రెల యూనిట్లు, 97,480 మేకల యూనిట్ల పంపిణీకి షెడ్యూల్ ఇచ్చాం.
- తొలి దశలో 2021, మార్చి చివరి నాటికి 20 వేల యూనిట్లు, రెండో విడతలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1.30 లక్షల యూనిట్లు, మూడో విడతలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 99 వేల యూనిట్లు పంపిణీ చేస్తాం.
- ఇందుకోసం దాదాపు 40 లక్షల మేకలు, గొర్రెలను సేకరించాల్సి వస్తోంది.
- కర్నూలు జిల్లా డోన్, అనంతపురం జిల్లా పెనుగొండలో గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తున్నాం.
పలు సంస్థలతో ఒప్పందం
- చేయూత సొమ్ముతో అక్క చెల్లెమ్మలకు ఈ విధంగా జీవనోపాధి కల్పించి, వారికి లాభాలు వచ్చేలా చూసేందుకు ఐటీసీ, అమూల్, రిలయెన్స్, పీ అండ్ జీ, హెచ్‌ఎల్‌ఎల్, అల్లానా వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం.
- రాష్ట్రంలో మాంసం కొనడానికి అల్లానా గ్రూప్ ఉంది. అల్లానా గ్రూప్ తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాలో మీట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది.
Published date : 11 Dec 2020 05:50PM