జెట్ విమాన సేవల తాత్కాలిక నిలిపివేత
Sakshi Education
రుణభారం, నిధుల కొరతతో నాలుగు నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ఏప్రిల్ 17న విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.
కార్యకలాపాలను కొనసాగించేందుకు అత్యవసరంగా కావాల్సిన రూ. 400 కోట్లను సమకూర్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది. దీంతో 20 వేల మందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం కంపెనీలో ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియంకు 51 శాతం, నరేష్ గోయల్‌కు 24 శాతం, ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు 12 శాతం వాటాలు ఉన్నారుు. 1992లో జెట్ ఎయిర్‌వేస్‌ను ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జెట్ ఎరుుర్‌వేస్ విమాన సేవల తాత్కాలిక నిలిపివేత
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎందుకు : ఆర్థిక సంక్షోభం కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : జెట్ ఎరుుర్‌వేస్ విమాన సేవల తాత్కాలిక నిలిపివేత
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎందుకు : ఆర్థిక సంక్షోభం కారణంగా
Published date : 18 Apr 2019 04:46PM