Skip to main content

జేకేఎల్‌ఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం

జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్‌ఎఫ్)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ చర్య తీసుకుంటున్నట్లు మార్చి 22న ప్రకటించింది. యాసిన్‌మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్‌ఎఫ్ జమ్మూకశ్మీర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదం, వేర్పాటు వాదానికి మద్దతివ్వడంతోపాటు ఉగ్ర సంస్థలతో సంబంధాలు నెరుపుతున్నట్లు తెలిపింది. అలాగే 1989లో కశ్మీరీ పండిట్లను స్వస్థలాల నుంచి వెళ్లగొట్టడానికి, వారి దారుణ హత్యలకు జేకేఎల్‌ఎఫ్ కారణమని ప్రభుత్వం అభిప్రాయపడింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్‌ఎఫ్)పై నిషేధం
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : ఉగ్రవాదం, వేర్పాటు వాదానికి మద్దతిస్తుందని
Published date : 23 Mar 2019 05:43PM

Photo Stories