జైలులో స్కిల్ డెవలప్‌మెంట్ యూనిట్ ఏర్పాటు
Sakshi Education
దేశంలోనే తొలిసారిగా కడప కేంద్ర కారాగారంలో రూ.4.70 కోట్ల వ్యయంతో స్కిల్ డెవలప్‌మెంట్ మాడ్యులర్ ఫర్నిచర్ యూనిట్ నెలకొల్పుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.
కడప కేంద్ర కారాగారంలో ఫిబ్రవరి 28న ఆమె ఈ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. స్విట్జర్లాండ్‌లో తప్ప మరెక్కడాలేని మాడ్యులర్ ఫర్నిచర్ యూనిట్‌ను కడప కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఖైదీలలో పరివర్తన కోసం చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఈ యూనిట్ నెలకొల్పుతున్నామన్నారు. రాబోయే నాలుగు నెలల్లో ఈ యూనిట్ పూర్తవుతుందన్నారు. ఖైదీల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్కిల్ డెవలప్‌మెంట్ మాడ్యులర్ ఫర్నిచర్ యూనిట్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత
ఎక్కడ : కడప కేంద్ర కారాగారం, కడప, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఖైదీల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు

Published date : 29 Feb 2020 05:41PM