జాతీయస్థాయిలో ఉత్తమ 10 పోలీస్ స్టేషన్లు ఇవే..
Sakshi Education
ఉత్తమ పోలీసింగ్ విధానాలతో ప్రజలకు మెరుగైన సేవలను అందించడం ద్వారా జాతీయస్థాయిలో 10 పోలీస్ స్టేషన్ల (పీఎస్)లో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల పోలీస్ స్టేషన్ ఒకటిగా నిలిచింది.
టాప్-10 ర్యాంకులను కేంద్ర హోంశాఖ డిసెంబర్ 6న విడుదల చేసింది. తొలి ర్యాంకు అండమాన్ నికోబార్ దీవుల్లోని అబెర్‌దీన్ పోలీస్‌స్టేషన్ కై వసం చేసుకోగా.. చొప్పదండి పోలీస్ స్టేషన్ 8వ ర్యాంకు సొంతంచేసుకుంది. పోలీసు స్టేషన్లను ప్రజాస్పందన ఆధారంగా, పోలీసు సిబ్బంది పనితీరు ఆధారంగా గ్రేడింగ్ చేయడానికి ర్యాంకులు కేటాయించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన మేరకు కేంద్ర హోంశాఖ ఈ సర్వే నిర్వహించింది. డేటా విశ్లేషణ, ప్రత్యక్ష పరిశీలన, ప్రజల అభిప్రాయాల ద్వారా దేశంలోని 15,579 పోలీస్ స్టేషన్లలో టాప్-10 పోలీస్ స్టేషన్లను గుర్తించారు. ర్యాంకింగ్ ప్రక్రియకు ముందు ప్రతి రాష్ట్రంలో ఉత్తమంగా పనిచేసే పోలీసు స్టేషన్లను ఎంపిక చేశారు. ఆస్తి నేరం, మహిళలపై నేరాలు, బలహీన వర్గాలపై నేరాల్లో పరిశోధనను పనితీరుకు ప్రాతిపదికగా ఎంచుకున్నారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి: జాతీయస్థాయిలో ఉత్తమ 10 పోలీస్ స్టేషన్లు ఎంపిక
ఎప్పుడు: డిసెంబర్ 6, 2019
ఎక్కడ: న్యూఢిల్లీ
ఎందుకు: ఉత్తమ పోలీసింగ్ విధానాలతో ప్రజలకు మెరుగైన సేవలను అందించినందుకు
ర్యాంకు | పోలీస్ స్టేషన్ | రాష్ట్రం |
1 | అబెర్‌దీన్ | అండమాన్ నికోబార్ దీవులు |
2 | బాలాసినోర్ | గుజరాత్ |
3 | ఏజేకే బుర్హాన్‌పూర్ | మధ్యప్రదేశ్ |
4 | ఏడబ్ల్యూపీఎస్ థేని | తమిళనాడు |
5 | ఎనిని | అరుణాచల్‌ప్రదేశ్ |
6 | బాబాహరిదాస్‌నగర్ | ఢిల్లీ |
7 | బాకనీ | రాజస్తాన్ |
8 | చొప్పదండి | తెలంగాణ |
9 | బొకోలిం | గోవా |
10 | బర్గావా | మధ్యప్రదేశ్ |
క్విక్ రివ్వూ:
ఏమిటి: జాతీయస్థాయిలో ఉత్తమ 10 పోలీస్ స్టేషన్లు ఎంపిక
ఎప్పుడు: డిసెంబర్ 6, 2019
ఎక్కడ: న్యూఢిల్లీ
ఎందుకు: ఉత్తమ పోలీసింగ్ విధానాలతో ప్రజలకు మెరుగైన సేవలను అందించినందుకు
Published date : 07 Dec 2019 05:23PM