Skip to main content

జాతీయ యువజన అవార్డులు ప్రధానం

2016-17కు ప్రకటించిన జాతీయ యువజన అవార్డులను ఆగస్టు 12న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రధానం చేశారు.
తెలంగాణ నుంచి ఒద్దిరాజు వంశీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ నుంచి గట్టెం వెంకటేష్, పృథ్వీ గొల్ల ఈ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. అవార్డు అందుకున్నవారికి రూ.50 వేల నగదు, పతకం, సర్టిఫికెట్ అందజేశారు. దేశవ్యాప్తంగా 20 మంది యువజన అవార్డులకు ఎంపికయ్యారు. వివిధ రంగాల అభివృద్ధి, సామాజిక సేవారంగంలో కృషికి గుర్తింపుగా కేంద్ర యువజన సర్వీసుల శాఖ ఈ యువజన అవార్డులను ఇస్తుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2016-17కు ప్రకటించిన జాతీయ యువజన అవార్డులు ప్రధానం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కిరణ్ రిజిజు
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 13 Aug 2019 05:28PM

Photo Stories