Skip to main content

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రకటన

2021 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర విద్యా శాఖ ఆగస్టు 18న ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 44 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా లింగరాజుపాలెం జెడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న ఫణిభూషణ్‌ శ్రీధర్, చిత్తూరు జిల్లా ఎం.పైపల్లె జెడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయుడు ఎస్‌.మునిరెడ్డి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన సవార్‌ఖేడా మండల ప్రజా పరిషత్‌ పాఠశాల ఇం చార్జి ప్రధానో పాధ్యాయుడు కడెర్ల రంగయ్యతో పాటు సిద్దిపేటలోని ఇందిరా నగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు పయ్యావుల రామస్వామి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2021, సెప్టెంబర్‌ 4, 5 తేదీల్లో అవార్డుల ప్రదానం జరుగుతుందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.

గ్రీన్‌ చాంపియన్‌ అవార్డు...
ప్రొఫెసర్‌ జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రతిష్టాత్మకమైన గ్రీన్‌ చాంపియన్‌ అవార్డు దక్కించుకుంది. దేశంలోని 400 జిల్లాల్లోని ఉన్నత విద్యా సంస్థల్లో స్వచ్ఛత, వాటర్‌ మేనేజ్‌మెంట్, శానిటేషన్, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అలాగే వివిధ సామాజిక కార్యక్రమాల అమలు తీరు మేరకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రకటన
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : కేంద్ర విద్యా శాఖ
ఎందుకు : విద్యా రంగంలో చేసిన విశేష కృషికిగాను...
Published date : 19 Aug 2021 06:33PM

Photo Stories