జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్ గెలిచిన జంట?
Sakshi Education
జాతీయ హార్డ్ కోర్టు సీనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్ విభాగంలో పీసీ అనిరుధ్ (తెలంగాణ)–నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్) జంట విజేతగా అవతరించింది.
హరియాణాలోని గురుగ్రామ్‌లో మార్చి 20న జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ అనిరుధ్–నిక్కీ ద్వయం 4–6, 6–3, 10–5తో 'సూపర్ టైబ్రేక్'లో రెండో సీడ్ ఇషాక్ అబ్దుల్లా–నితిన్ కుమార్ సిన్హా (పశ్చిమ బెంగాల్) జోడీపై విజయం సాధించింది.
మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగమ్మాయి రిషిక సుంకర తన భాగస్వామి సాయిసంహిత (తమిళనాడు)తో కలిసి టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్లో రిషిక–సంహిత ద్వయం 7–5, 7–6 (7/2)తో సౌమ్య విజ్ (గుజరాత్)–సోహా (కర్ణాటక) జంటపై నెగ్గింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచిన జంట?
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : పీసీ అనిరుధ్ (తెలంగాణ)–నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్) జంట
ఎక్కడ : గురుగ్రామ్, హరియాణా

Published date : 22 Mar 2021 05:56PM