జాతీయ సైన్స్ దినోత్సవ అవార్డుల ప్రదానం
Sakshi Education
జాతీయ సైన్స్ దినోత్సవం(ఫిబ్రవరి 28) సందర్భంగా భారతీయ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పరిశోధన పత్రాలను ప్రచురించిన పలువురికి అవార్డులు అందజేశారు.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఫిబ్రవరి 28న జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను అందజేశారు. పోస్ట్ డాక్టర్ ఫెలో (పీడీఎఫ్) విభాగంలో తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌కి చెందిన డాక్టర్ హర్షిణి చక్రవర్తి, మద్రాస్ ఐఐటీకి చెందిన డాక్టర్ శిరీష బొడ్డపాటి అవ్సార్ (అగుమెటింగ్ రైటింగ్ స్కిల్స్ ఫర్ అర్టిక్యులేటింగ్ రీసెర్చ్) అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.
పరిశోధనల్లో మహిళలు 15 శాతమే
సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ... శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు తక్కువ సంఖ్యలో ఉన్నారని వ్యాఖ్యానించారు. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మహిళలు 15 శాతానికే పరిమితం అయ్యారని పేర్కొన్నారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో లింగ సమానత్వం, అభివృద్ధికి సంబంధించి మూడు కార్యక్రమాలను కోవింద్ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ సైన్స్ దినోత్సవ అవార్డుల ప్రదానం
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ

Published date : 29 Feb 2020 05:49PM