జాతీయ పోషకాహార సంస్థ డెరైక్టర్‌గా ప్రస్తుతం ఎవరు ఉన్నారు?
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా యాంటీబాడీస్ (ప్రతి దేహకాలు) అభివృద్ధి చెందాయి. ఈ మేరకు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్)లు ఫిబ్రవరి 9న వివరాలు వెల్లడించాయి. కోవిడ్‌పై పోరాడే యాంటీబాడీస్ రాష్ట్ర వ్యాప్తంగా 24.1 శాతం మందిలో ఉన్నట్లు తెలిపాయి. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉందని పేర్కొన్నాయి.
2020, మేలో మొదటి సీరో సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 0.33 శాతం మాత్రమే కరోనా యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత 2020, ఆగస్టులో రెండో సీరో సర్వేలో 12.5 శాతం జనాభాలో యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు తేలింది. 2020, డిసెంబర్‌లో జరిపిన మూడో సర్వేలో 24.1 శాతం మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందాయని తేలింది. ఎన్‌ఐఎన్ డెరైక్టర్‌గా ప్రస్తుతం డాక్టర్ ఆర్.హేమలత ఉన్నారు. ఎన్‌ఐఎన్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా యాంటీబాడీస్ (ప్రతి దేహకాలు) అభివృద్ధి చెందాయి
ఎప్పుడు : ఫిబ్రవరి
ఎవరు : భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్)
ఎక్కడ : తెలంగాణ