జాతీయ క్రీడలు నిరవధిక వాయిదా
Sakshi Education
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన జాతీయ క్రీడలను ఈసారి నిరవధికంగా వాయిదా వేశారు.

క్రీడలకు ఆతిథ్యమివ్వాల్సిన గోవాలో కరోనా వ్యాప్తి పెరిగిపోవడంతో అనూహ్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా దెబ్బకు జాతీయ క్రీడల నిర్వాహక కమిటీ ఈ వాయిదా నిర్ణయం తీసుకుందని గోవా క్రీడల మంత్రి మనోహర్ అగోంకర్ మే 28న ఐఓఏకు తెలిపారు. సెప్టెంబర్ చివర్లో జరిగే కమిటీ సమావేశంలో క్రీడల షెడ్యూల్ను నిర్ణయిస్తామన్నారు. షెడ్యూల్ ప్రకారం 2020, అక్టోబర్ 20 నుంచి నవంబర్ 4 వరకు జాతీయ క్రీడలు జరగాల్సి ఉంది.
2015లో చివరిసారిగా...
నిజానికి 2018 నవంబర్లోనే జరగాల్సిన ఈ క్రీడలు గోవా ప్రభుత్వ అలసత్వం కారణంగా ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడ్డాయి. 2020 ఏడాది గేమ్స్ నిర్వహించేందుకు గోవా సిద్ధమైనప్పటికీ కరోనాతో మరోసారి ఆటంకం ఏర్పడింది. చివరిసారిగా 2015లో కేరళ వేదికగా జాతీయ క్రీడలు జరిగాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ క్రీడలు నిరవధిక వాయిదా
ఎప్పుడు : మే 28
ఎవరు : జాతీయ క్రీడల నిర్వాహక కమిటీ
ఎందుకు : గోవాలో కరోనా వ్యాప్తి పెరిగిపోవడంతో

Published date : 29 May 2020 05:24PM