జాతీయ క్రీడా పురస్కారాలు-2020
ఆన్‌లైన్‌లో...
ప్రతి యేటా జాతీయ క్రీడా పురస్కారాలను జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్ లో ఘనంగా నిర్వహిస్తారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి ఆన్లైన్ లో నిర్వహించాలని నిర్ణయించారు.
ఏపీ నుంచి ఇద్దరికి...
2020 ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి జాతీయ క్రీడా పురస్కారాలు లభించాయి. యువ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్‌కు ‘అర్జున’, మాజీ బాక్సర్ నగిశెట్టి ఉషకు ‘ద్యాన్‌చంద్’ జీవితకాల సాఫల్య పురస్కారం లభించాయి.
రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న (5):
2020ఏడాదికిగాను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ను ఒకేసారి అత్యధికంగా ఐదుగురికి అందజేయాలని క్రీడాశాఖ నిర్ణయించింది. గతంలో 2016లో ఒకేసారి అత్యధికంగా నలుగురికి ‘ఖేల్‌రత్న’ అవార్డును ఇచ్చారు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన స్మారకార్థం 1991లో ‘ఖేల్‌రత్న’ అవార్డును ప్రవేశపెట్టారు. రాజీవ్ ఖేల్ రత్న విజేతకు పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ. 7.5 లక్షలు బహుమానంగా అందిస్తారు.
సంఖ్య | పేరు | క్రీడాంశం |
1 | రోహిత్ శర్మ | క్రికెట్ |
2 | వినేశ్ ఫొగాట్ | మహిళల రెజ్లింగ్ |
3 | రాణి రాంపాల్ | మహిళల హాకీ |
4 | మనికబత్రా | మహిళల టేబుల్ టెన్నిస్ |
5 | మరియప్పన్తంగవేలు | పారా అథ్లెటిక్స్ |
అర్జున అవార్డు (27):
2020 ఏడాదికి మొత్తం 27 మంది అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. అర్జున అవార్డు గ్రహీతలకు అర్జునుడి ప్రతిమతోపాటు రూ. 5 లక్షలు నగదు పురస్కారం అందిస్తారు.
సంఖ్య | పేరు | క్రీడాంశం |
1 | సాత్విక్ సాయిరాజ్ | బ్యాడ్మింటన్ |
2 | చిరాగ్ శెట్టి | బ్యాడ్మింటన్ |
3 | ఇషాంత్ శర్మ | క్రికెట్ |
4 | దీప్తి శర్మ | క్రికెట్ |
5 | మనీశ్ కౌశిక్ | బాక్సింగ్ |
6 | లవ్లీనా బొర్గోహైన్ | బాక్సింగ్ |
7 | మను భాకర్ | షూటింగ్ |
8 | సౌరభ్ చౌధరీ | షూటింగ్ |
9 | దివ్య కాక్రన్ | రెజ్లింగ్ |
10 | రాహుల్ అవారే | రెజ్లింగ్ |
11 | ఆకాశ్‌దీప్ సింగ్ | హాకీ |
12 | దీపిక | హాకీ |
13 | దివిజ్ శరణ్ | టెన్నిస్ |
14 | అతాను దాస్ | ఆర్చరీ |
15 | ద్యుతీ చంద్ | అథ్లెటిక్స్ |
16 | విశేష్ భృగువంశీ | బాస్కెట్‌బాల్ |
17 | అజయ్ అనంత్ సావంత్ | ఈక్వేస్ట్రియన్ |
18 | సందేశ్ జింగాన్ | ఫుట్‌బాల్ |
19 | అదితి అశోక్ | గోల్ఫ్ |
20 | దీపక్ హుడా | కబడ్డీ |
21 | సారిక కాలే | ఖో–ఖో |
22 | దత్తు బబన్భోఖనాల్ | రోయింగ్ |
23 | మధురికపాట్కర్ | టేబుల్ టెన్నిస్ |
24 | శివ కేశవన్ | వింటర్ స్పోర్ట్స్ |
25 | సుయశ్ నారాయణ్ జాదవ్ | పారా స్విమ్మింగ్ |
26 | సందీప్ | పారా అథ్లెటిక్స్ |
27 | మనీశ్ నర్వాల్ | పారా షూటింగ్ |
ద్రోణాచార్య అవార్డు (లైఫ్ టైమ్ కేటగిరీ–8):
సంఖ్య | పేరు | క్రీడాంశం |
1 | ధర్మేంద్ర తివారీ | ఆర్చరీ |
2 | పురుషోత్తమ్ రాయ్ | అథ్లెటిక్స్ |
3 | శివ్ సింగ్ | బాక్సింగ్ |
4 | రమేశ్ పథానియా | హాకీ |
5 | కృషన్ కుమార్ హుడా | కబడ్డీ |
6 | విజయ్ బాలచంద్ర మునీశ్వర్ | పవర్‌లిఫ్టింగ్ |
7 | నరేశ్ కుమార్ | టెన్నిస్ |
8 | ఓంప్రకాశ్ దహియా | రెజ్లింగ్ |
ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ కేటగిరీ–5):
సంఖ్య | పేరు | క్రీడాంశం |
1 | జూడ్ ఫెలిక్స్ | సెబాస్టియన్ హాకీ |
2 | జస్పాల్ రాణా | షూటింగ్ |
3 | కుల్‌దీప్ కుమార్ హండూ | ఉషు |
4 | యోగేశ్ మాలవియా | మల్లఖంబ్ |
5 | గౌరవ్ ఖన్నా | పారా బ్యాడ్మింటన్ |
ద్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్) అవార్డు (15):
గతంలో ‘ధ్యాన్ చంద్’ అవార్డును ఒకేసారి అత్యధికంగా ఐదుగురికి ఇచ్చారు.
సంఖ్య | పేరు | క్రీడాంశం |
1 | నగిశెట్టి ఉష | బాక్సింగ్ |
2 | లఖా సింగ్ | బాక్సింగ్ |
3 | కుల్‌దీప్ సింగ్ భుల్లర్ | అథ్లెటిక్స్ |
4 | జిన్సీ ఫిలిప్స్ | అథ్లెటిక్స్ |
5 | ప్రదీప్ శ్రీకృష్ణ గాంధే | బ్యాడ్మింటన్ |
6 | తృప్తి ముర్గుండే | బ్యాడ్మింటన్ |
7 | అజిత్ సింగ్ | హాకీ |
8 | మన్ ప్రీత్ సింగ్ | కబడ్డీ |
9 | మంజీత్ సింగ్ | రోయింగ్ |
10 | సచిన్ నాగ్ | స్విమ్మింగ్ |
11 | నందన్ బాల్ | టెన్నిస్ |
12 | నేత్రపాల్ హుడా | రెజ్లింగ్ |
13 | సుఖ్వీందర్ సింగ్ సంధూ | ఫుట్‌బాల్ |
14 | రంజిత్ కుమార్ | పారా అథ్లెటిక్స్ |
15 | సత్యప్రకాశ్ తివారీ | పారా బ్యాడ్మింటన్ |
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (క్రీడా ప్రదర్శనలో ఉత్తమ విశ్వవిద్యాలయం): పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్).