Skip to main content

జాతీయ క్రీడా పురస్కారాల ప్యానల్‌ నియామకం

జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీని జూలై 31న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించింది.
Current Affairs 12 మంది సభ్యుల ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ ముకుందకమ్‌ శర్మ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కమిటీలో మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్‌ సింగ్‌, దీపా మలిక్, మాజీ టీటీ ప్లేయర్‌ మోనాలిసా బరువా మెహతా, భారత మాజీ బాక్సర్‌ వెంకటేశన్దేవరాజన్, సాయ్ డైరెక్టర్ జనరల్ సందీప్‌ ప్రదాన్, సంయుక్త కార్యదర్శి ఎల్‌ఎస్‌ సింగ్, టాప్స్‌ సీఈవో రాజేశ్‌ రాజగోపాలన్, క్రీడా వ్యాఖ్యాత మనీశ్‌ బతావియా, క్రీడా పాత్రికేయులు అలోక్‌ సిన్హా, నీరూభాటియా సభ్యులుగా ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ నియామకం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ
Published date : 02 Aug 2020 10:39AM

Photo Stories