Skip to main content

జాతీయ జల అవార్డులు-2019

కేంద్ర జల్ శక్తి శాఖ 2019 సంవత్సరానికి గాను 2వ జాతీయ జల అవార్డులను (ఎన్‌డబ్ల్యుఏ) ప్రకటించింది.
Current Affairs

2020, నవంబర్ 11, 12వ తేదీలలో ఆన్‌లైన్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంజరిగింది.2020 ఏడాది అవార్డులకుగాను మొత్తం 1,112 దరఖాస్తుల్లో మొత్తం 98 మంది విజేతలను 16 కేటగిరీల్లో ఎంపిక చేశారు. జల సంరక్షణ-నిర్వహణ రంగంలో ప్రశంసనీయంగా పనిచేస్తున్న వ్యక్తులను, సంస్థలను గుర్తించి అవార్డులు ప్రదానం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. నీటి ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించినందుకు, ఉత్తమమైన నీటి వినియోగ పద్ధతులను అనుసరించేలా ప్రేరేపించినందుకు ఈ అవార్డులు అందిస్తున్నారు.

చదవండి: ప్రస్తుతం కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?

ఉత్తమ రాష్ట్రాల కేటగిరీలో...

  • 2019 ఏడాది ఉత్తమ రాష్ట్రాల కేటగిరీలో తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
  • ఉత్తమ జిల్లాల కేటగిరీలో ‘నదుల పునరుజ్జీవనం-జల సంరక్షణ’లో అత్యుత్తమ పనితీరు కనబరచి సౌత్ జోన్ (దక్షిణాది రాష్ట్రాల) నుంచి వైఎస్సార్ కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
  • ఆకాంక్ష జిల్లాల కేటగిరీలో విజయనగరం జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జాతీయ జల అవార్డులు-2019ప్రదానం
ఎప్పుడు : 2020, నవంబర్ 11
ఎవరు : కేంద్ర జల్ శక్తి శాఖ
ఎక్కడ : ఆన్‌లైన్ విధానంలో
ఎందుకు : జల సంరక్షణ-నిర్వహణ రంగంలో ప్రశంసనీయంగా పనిచేస్తున్న వ్యక్తులను, సంస్థలను గుర్తించి, ప్రోత్సహించేందుకు
Published date : 13 Nov 2020 11:11AM

Photo Stories