జాబిల్లిపై వేర్వేరు కాలాల మంచు
Sakshi Education
జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలోని పలు లోయల్లో నిక్షిప్తమై ఉన్న మంచు వేర్వేరు మార్గాల్లో ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తల తాజా పరిశోధన చెబుతోంది.
భవిష్యత్‌లో మానవ ఆవాసాల ప్రణాళికలకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని అంచనా. జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో నీరు ఉన్నట్లు నిర్ధారణ కావడంతోనే మన సహజ ఉపగ్రహంపై సర్వత్రా ఆసక్తి పెరిగిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఉన్న మంచు మోతాదు ఎంతన్నది మాత్రం ఇప్పటివరకూ స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో ఇకరస్ జర్నల్‌లో తాజాగా ఈ పరిశోధన ప్రచురితమైంది. దక్షిణ ధ్రువ ప్రాంతంలోని లోయల్లో లక్షల ఏళ్ల పురాతనమైన మంచుతోపాటు ఇటీవలి కాలంలో ఏర్పడ్డ మంచు కూడా ఉందని బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఏరియల్ డచ్ తెలిపారు. ఈ తేడా ఆధారంగా జాబిల్లిపై మంచు ఎప్పుడు, ఎలా ఏర్పడిందో తెలుసుకునే అవకాశముంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జాబిల్లిపై వేర్వేరు కాలాల మంచు
ఎందుకు: భవిష్యత్‌లో మానవ ఆవాసాల ప్రణాళికలకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని
క్విక్ రివ్యూ:
ఏమిటి: జాబిల్లిపై వేర్వేరు కాలాల మంచు
ఎందుకు: భవిష్యత్‌లో మానవ ఆవాసాల ప్రణాళికలకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని
Published date : 12 Oct 2019 04:30PM