ఇవర్‌మెక్టిన్‌తో కరోనాకు చెక్: మొనాశ్ వర్సిటీ
Sakshi Education
ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఇవర్‌మెక్టిన్ అనే మందు 48 గంటల్లోనే మట్టుబెడుతున్నట్లు మొనాశ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇవర్‌మెక్టిన్‌తో కరోనాకు చెక్
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : మొనాశ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
ఎక్కడ : ఆస్ట్రేలియా
శరీరంలోని పరాన్న జీవులను చంపేందుకు ఈ మందును చాలాకాలంగా వాడుతుండగా ఆస్ట్రేలియాలోని మొనాశ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని కోవిడ్-19పై ప్రయోగించారు. పరిశోధనశాలలో పెంచిన కరోనా వైరస్‌పై ఈ మందును ప్రయోగించినప్పుడు ఒకే ఒక్క డోస్‌తో వైరస్ 48 గంటల్లో మరణించినట్లు ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ కైల్ వాగ్‌స్టాఫ్ తెలిపారు. ఈ మందు పరిశోధనశాలలో కరోనా వైరస్‌తోపాటు డెంగీ, ఇన్‌ఫ్లూయెంజా, జికా, హెచ్‌ఐవీ వైరస్‌లపై కూడా ప్రభావం చూపిందని చెప్పారు. 24 గంటల తరువాతే ప్రభావం కనిపించడం మొదలైందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇవర్‌మెక్టిన్‌తో కరోనాకు చెక్
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : మొనాశ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
ఎక్కడ : ఆస్ట్రేలియా
Published date : 07 Apr 2020 06:02PM