ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసు విజేత?
Sakshi Education
ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో అల్ఫా టౌరి జట్టు డ్రైవర్ పియర్ గాస్లీ (ఫ్రాన్‌స) విజేతగా అవతరించాడు.
ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్ 6న జరిగిన ఈ రేసులో 24 ఏళ్ల గాస్లీ 53 ల్యాప్‌ల దూరాన్ని గంటా 47 నిమిషాల 06.056 సెకన్లలో ముగించి తన కెరీర్‌లో తొలి ఎఫ్1 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా 1996లో ఒలివర్ పానిస్ (మొనాకో గ్రాండ్‌ప్రి) తర్వాత ఎఫ్1 రేసులో టైటిల్ గెలిచిన తొలి ఫ్రాన్‌స డ్రైవర్‌గా గాస్లీ గుర్తింపు పొందాడు. కార్లోస్ సెరుుంజ్ (మెక్‌లారెన్) రెండో స్థానాన్ని, లాన్‌స స్ట్రాల్ (రేసింగ్ పారుుంట్) మూడో స్థానాన్ని పొందారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసు విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : అల్ఫా టౌరి జట్టు డ్రైవర్ పియర్ గాస్లీ (ఫ్రాన్‌స)
ఎక్కడ : మోంజా, ఇటలీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసు విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : అల్ఫా టౌరి జట్టు డ్రైవర్ పియర్ గాస్లీ (ఫ్రాన్‌స)
ఎక్కడ : మోంజా, ఇటలీ
Published date : 08 Sep 2020 12:45PM