ఇటీవల పరీక్షించిన అభ్యాస్ గగనతల వాహనాలను అభివృద్ధి చేసిన సంస్థ?
Sakshi Education
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చేపట్టిన అభ్యాస్ గగనతల వాహన ప్రయోగ పరీక్ష విజయవంతమైంది.
ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఉన్న చాందీపూర్ సమీకృత పరీక్ష వేదిక నుంచి సెప్టెంబర్ 22న ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. హైస్పీడ్ ఎక్స్‌పాండబుల్ ఏరియల్ టార్గెట్ (హీట్) అని కూడా పిలిచే అభ్యాస్‌ను రెండు బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. ప్రయోగంలో భాగంగా రెండు అభ్యాస్‌లు సమర్థంగా నింగిలోకి ఎగిరాయి. వివిధ రకాల క్షిపణుల సామర్థ్యాన్ని పరిశీలించే క్రమంలో... ఆ అస్త్రాలకు లక్ష్యంగా అభ్యాస్‌ను ఉపయోగిస్తారు. డీఆర్‌డీవోకి చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) అభ్యాస్ వాహనాలను అభివృద్ధి చేసింది.
స్వతంత్రంగా పనిచేసేలా...
చిన్న గ్యాస్ టర్బైన్ ఇంజిన్ ద్వారా దూసుకెళ్లే అభ్యాస్‌లో మెమ్స్ ఆధారిత నావికా వ్యవస్థ ఉంటుంది. ఇది పూర్తిగా స్వతంత్రంగా పనిచేసేలా రూపొందించారు. నేలపై నుంచే ఓ ల్యాప్‌టాప్ ఆధారిత గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ ద్వారా దీన్ని పరిశీలించవచ్చు. తాజా పరీక్షల సందర్భంగా అభ్యాస్ 5 కిలోమీటర్ల ఎత్తులో ధ్వని వేగంలో సగం వేగం(0.5 మ్యాక్ వేగం)తో ప్రయాణించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అభ్యాస్ గగనతల వాహన ప్రయోగ పరీక్ష విజయవంతం
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
ఎక్కడ : చాందీపూర్, బాలసోర్, ఒడిశా

Published date : 25 Sep 2020 05:31PM