Skip to main content

ఇటీవల పోలీస్ విభాగంలోకి ట్రాన్స్ జెండర్లను తీసుకున్న రాష్ట్రం?

ఛత్తీస్గడ్ పోలీసు వ్యవస్థ ఓ సరికొత్త మార్పుకి శ్రీకారం చుట్టింది.
Current Affairs
ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోకి 13 మంది ట్రాన్స్‌ జెండర్‌లను నియమించి, ట్రాన్స్‌జెండర్‌ సమాజంలో విశ్వాసం నింపేందుకూ, వారిపట్ల సమాజం దృష్టిలో మార్పుని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. రాష్ట్ర పోలీసు శాఖలో ట్రాన్స్‌ జెండర్‌లకు అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. 13 మంది ట్రాన్స్‌జెండర్‌లను ప్రతిభ ఆధారంగా పోలీస్‌ కానిస్టేబుళ్లుగా నియమించామని, మరో ఇద్దరు వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారని ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ డి.ఎం.అవస్థి తెలిపారు. 2017–18లో పరీక్షలు నిర్వహించగా, 2021 మార్చి 1న ఫలితాలు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

ఛత్తీస్‌గడ్‌ రాజధాని: నయా రాయ్‌పూర్‌
ఛత్తీస్‌గడ్‌ ప్రస్తుత గవర్నర్‌: అనసూయ ఊకే
ఛత్తీస్‌గడ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి: భూపేశ్‌ బఘేల్‌

చదవండి: రాష్ట్రంలో తొలి ట్రాన్స్‌ జెండర్‌ న్యాయవాది

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోకి 13 మంది ట్రాన్స్‌జెండర్‌ల నియామకం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ డి.ఎం.అవస్థి
ఎందుకు : ట్రాన్స్‌జెండర్‌ సమాజంలో విశ్వాసం నింపేందుకూ, వారిపట్ల సమాజం దృష్టిలో మార్పుని తీసుకొచ్చేందుకు
Published date : 05 Mar 2021 05:50PM

Photo Stories