Skip to main content

ఇటీవల కొత్తగా ఎనిమిది రైళ్లను ఎక్కడ ప్రారంభించారు?

అహ్మదాబాద్, వారణాసి, దాదర్, హజ్రత్ నిజాముద్దీన్, రేవా, చెన్నై, ప్రతాప్‌నగర్ ప్రాంతాలను గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ఉన్న కేవాడియాతో అనుసంధానించేందుకుగాను కొత్తగా ఎనిమిది రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
Current Affairs

మరోవైపు దబోయి, చందోడ్, కేవాడియా రైల్వే స్టేషన్లను, దబోయి-చందోడ్, చందోడ్-కేవాడియా బ్రాడ్‌గేజ్ లైన్లను, నూతనంగా విద్యుదీకరించిన ప్రతాప్‌నగర్-కేవాడియా సెక్షన్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు.

జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్...
ప్రధాని తాజాగా ప్రారంభించిన 8 రైళ్లలో అహ్మదాబాద్-కేవాడియా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. ఈ రైల్‌లో విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నాయి. కోచ్ కిటీకలు, తలుపులే కాకుండా పైభాగాన్ని కూడా అద్దాలతోనే తీర్చిదిద్దారు.

ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు

  • అమెరికాలోని స్వేచ్ఛా విగ్రహం(స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ) కంటే గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని(స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) సందర్శించడానికే ఎక్కువ మంది వస్తారు.
  • గిరిజన ప్రాంతమైన కేవాడియాలో ఉన్న ఐక్యతా విగ్రహాన్ని ఇప్పటివరకు 50 లక్షల మంది సందర్శించారు.
  • రాబోయే రోజుల్లో నిత్యం లక్ష మంది ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తారని ఒక సర్వేలో తేలింది.
  • ఒకే గమ్యస్థానానికి చేరుకునే 8 రైళ్లకు ఒకే సమయంలో పచ్చజెండా ఊపడం ఇదే మొదటిసారి.


చదవండి: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎత్తు ఎంత?

క్విక్ రివ్యూ :
ఏమిటి : కొత్తగా ఎనిమిది రైళ్లు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : అహ్మదాబాద్, వారణాసి, దాదర్, హజ్రత్ నిజాముద్దీన్, రేవా, చెన్నై, ప్రతాప్‌నగర్ ప్రాంతాలను గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ఉన్న కేవాడియాతో అనుసంధానించేందుకుగాను

Published date : 20 Jan 2021 01:42PM

Photo Stories