ఇటీవల ఏ దేశానికి చెందిన క్రికెట్ బోర్డును రద్దు చేశారు?
Sakshi Education
కొంత కాలంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ)పై ఆ దేశ ప్రభుత్వం చర్య తీసుకుంది.
బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించి క్రికెట్ కార్యకలాపాలు మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకుంది. జాతి వివక్ష ఆరోపణలు, జట్టు ఎంపికలో రిజర్వేషన్‌లు, ఆర్థిక సమస్యలు తదితర కారణాలతో సఫారీ క్రికెట్ పరిస్థితి చాలా దెబ్బతింది. మైదానంలో కూడా ఆ జట్టు వరుస పరాజయాలు ఎదుర్కొంటూ వస్తోంది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండరాదు.
ఏఎఫ్‌సీ కప్ రద్దు
ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) కప్-2020ను రద్దు చేస్తున్నట్లు ఏఎఫ్‌సీ సెప్టెంబర్ 10న ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 2020, మార్చిలోనే ఈ టోర్నీ జరగాల్సి ఉన్నా... కరోనా విజృంభణతో సెప్టెంబర్‌కు వాయిదా పడింది. తాజాగా రద్దయింది. ఏఎఫ్‌సీ అండర్-16, అండర్-19 టోర్నీలను 2021 ఏడాదికి వాయిదా వేస్తూ ఏఎఫ్‌సీ నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) రద్దు
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : దక్షిణాఫ్రికా ప్రభుత్వం
ఎందుకు : జాతి వివక్ష ఆరోపణలు, జట్టు ఎంపికలో రిజర్వేషన్‌లు, ఆర్థిక సమస్యల వంటి సంక్షోభాల కారణంగా

Published date : 11 Sep 2020 05:21PM