ఇటాలియన్ గ్రాండ్‌ప్రి విజేతగా చార్లెస్
Sakshi Education
ఇటాలియన్ గ్రాండ్‌ప్రి టైటిల్ విజేతగా ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ నిలిచాడు.
ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్ 8న జరిగిన ప్రధాన రేసులో చార్లెస్ 53 ల్యాపుల రేసును ఒక గంటా 15 నిమిషాల 26.665 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించాడు. తాజా విజయంతో ఫెరారీ జట్టుకు సొంతగడ్డపై తొమ్మిదేళ్ల తర్వాత టైటిల్ దక్కినట్లయింది. ఈ రేసులో మెర్సిడెస్ డ్రైవర్లు బొటాస్, హామిల్టన్ వరుసగా రెండు, మూడో స్థానానికి పరిమితమయ్యారు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 22న జరుగనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇటాలియన్ గ్రాండ్‌ప్రి టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్
ఎక్కడ : మోంజా, ఇటలీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇటాలియన్ గ్రాండ్‌ప్రి టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్
ఎక్కడ : మోంజా, ఇటలీ
Published date : 09 Sep 2019 05:49PM