ఇస్రో చైర్మన్ శివన్ పదవీ కాలం పొడిగింపు
Sakshi Education
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ కైలాసవాడివో శివన్ పదవీ కాలాన్నీ మరో సంవత్సర కాలం పొడిగించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు శివన్ పదవీ కాలాన్నీ పొడిగిస్తూ అపాయింట్‌మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీస్ కార్యదర్శి శ్రీనివాస్ ఆర్ కటికితల డిసెంబర్ 31న ఓ ప్రకటన విడుదల చేశారు.
2018, జనవరి 15న ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శివన్ పదవీ కాలం 2021, జనవరి 14తో ముగియనుంది. అయితే 2021 ఏడాది గగన్‌యాన్-1, చంద్రయాన్-3 లాంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేయనున్న దృష్ట్యా ఆయన పదవీ కాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించారు. దీంతో 2022, జనవరి 14 వరకు ఇస్రో చైర్మన్ పదవిలో శివన్ కొనసాగనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇస్రో చైర్మన్ డాక్టర్ కైలాసవాడివో శివన్ పదవీ కాలం పొడిగింపు
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : 2021 ఏడాది గగన్‌యాన్-1, చంద్రయాన్-3 లాంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేయనున్న దృష్ట్యా

Published date : 02 Jan 2021 05:39PM