Skip to main content

ఈసీఎంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం

జర్మనీకి చెందిన యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్‌తో (ఈసీఎం)తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఒప్పందం కుదుర్చుకుంది.
రోబొటిక్, మెకట్రానిక్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఒప్పందం ప్రకారం మొదటి విడతలో భాగంగా 11 ఇంజరినీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ డ్ రోబోటిక్స్ ల్యాబ్స్ కేంద్రాల్లో 788 మంది విద్యార్థులు ఏఆర్సీ 1.0లో శిక్షణ పూర్తి చేసుకున్నారని చెప్పారు. విజయవాడలో అక్టోబర్ 17న జరిగిన కార్యక్రమంలో రెండో విడత 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన రోబోటిక్ ల్యాబ్‌లను ఆన్‌లైన్ ద్వారా చల్లా ప్రారంభించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఈసీఎంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 17
ఎవరు : ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి
ఎందుకు : రోబొటిక్, మెకట్రానిక్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం కోసం
Published date : 18 Oct 2019 05:23PM

Photo Stories