ఇర్కోడ్ గ్రామానికి స్వచ్ఛత స్వశక్తి అవార్డు
Sakshi Education
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా ఇర్కోడ్ గ్రామానికి స్వచ్ఛత స్వశక్తి కిరణ్-2019 అవార్డు లభించింది.
సాంఘిక-సామాజిక అభివృద్ధి అంశంపై ఇర్కోడ్ గ్రామం ఈ అవార్డుకి ఎంపికైనట్లు కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ సంజిత్‌పాత్ జోషి సెప్టెంబర్ 19న వెల్లడించారు. 2019, అక్టోబర్‌లో ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో కేంద్రమంత్రుల చేతుల మీదుగా రూ.8 లక్షల రివార్డుతో పాటుగా అవార్డును గ్రామ ప్రతినిధులు అందుకోనున్నారు.
Published date : 20 Sep 2019 05:31PM