ఇరాన్ ఫుట్‌బాల్ స్టేడియాల్లోకి మహిళలు
Sakshi Education
ఇరాన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లను స్టేడియాలకు వెళ్లి చూడడానికి మహిళలను కూడా అనుమతిస్తున్నట్టు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆజాది స్టేడియంలో అక్టోబర్ 10న ఇరాన్-కంబోడియా మధ్య 2022 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు మహిళలు హాజరు కానున్నారు. 1981 నుంచి ఇరాన్‌లో క్రీడా మైదానాల్లోకి స్త్రీలకు ప్రవేశం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఇరాన్‌ను అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి బహిష్కరిస్తామని ఫిఫా హెచ్చరించడంతో ఇరాన్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇరాన్ ఫుట్‌బాల్ స్టేడియాల్లోకి మహిళలకు అనుమతి
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : ఇరాన్ ప్రభుత్వం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇరాన్ ఫుట్‌బాల్ స్టేడియాల్లోకి మహిళలకు అనుమతి
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : ఇరాన్ ప్రభుత్వం
Published date : 10 Oct 2019 06:08PM