Skip to main content

ఇరాక్‌లో మొట్టమొదటిసారిగా పోప్ ఫ్రాన్సిస్ పర్యటన

కేథలిక్ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్(84) అరబ్ దేశం ఇరాక్లో మొట్టమొదటిసారిగా పర్యటించారు.
Current Affairsమార్చి 6న ఆయన ఇరాక్‌లోని పవిత్ర నగరం నజాఫ్‌లో షియాల గ్రాండ్‌ అయతొల్లా అలీ అల్‌– సిస్తానీ(90)తో భేటీ అయ్యారు. ఈ చారిత్రక సమావేశంలో ఇరువురు మతపెద్దలు శాంతియుత సహజీవనం సాగించాలని ముస్లింలను కోరారు. ఇరాక్‌లోని క్రైస్తవులను కాపాడుకోవడంలో మతాధికారులు కీలకపాత్ర పోషించాలని అల్‌– సిస్తానీ ఆకాంక్షించారు. ఇరాక్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియాలు గౌరవించే మత పెద్దల్లో అల్‌ సిస్తానీ ఒకరు.

పురాతన ఉర్‌(ఇరాక్‌) నగరంలో సర్వమత సమ్మేళనంలోనూ పోప్‌ పాల్గొన్నారు. క్రైస్తవులు, ముస్లింలు, యూదుల విశ్వాసాలకు మూలపురుషుడిగా భావించే అబ్రహాం జన్మించింది ఉర్‌లోనే కావడం విశేషం.
Published date : 10 Mar 2021 06:11PM

Photo Stories