Skip to main content

ఇన్‌స్ట్రాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలెబ్రిటీ

ఇన్‌స్ట్రాగామ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని అనుసరిస్తున్న వారి సంఖ్య 7 కోట్ల 50 లక్షలు దాటింది.
Edu newsదాంతో ఇన్‌స్ట్రాగామ్‌లో ఏడున్నర కోట్లు ఫాలోవర్లు కలిగిన తొలి ఆసియా సెలెబ్రిటీగా కోహ్లి గుర్తింపు పొందాడు. కోహ్లి తర్వాత ఆసియా నుంచి అత్యధిక ఫాలోవర్లు కలిగిన వారి జాబితాలో రెండో స్థానంలో ప్రియాంక చోప్రా (5 కోట్ల 60 లక్షలు), మూడో స్థానంలో దీపిక పదుకొనె (5 కోట్ల 20 లక్షలు) ఉన్నారు.
 
 క్రిస్టియానో రొనాల్డో...
 ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్ట్రాగామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల జాబితాలో కోహ్లి (7,57,89,920) నాలుగో స్థానంలో ఉన్నాడు. తొలి మూడు స్థానాల్లో ఫుట్‌బాల్ స్టార్స్ క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్-23 కోట్లు), లయెనెల్ మెస్సీ (అర్జెంటీనా-16 కోట్లు), నెమార్ (బ్రెజిల్-14 కోట్లు) ఉన్నారు. ఇతర సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌లో కోహ్లిని 4 కోట్ల 32 లక్షలు మంది... ట్విట్టర్‌లో 3 కోట్ల 74 లక్షల మంది అనుసరిస్తున్నారు.

 క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
ఇన్‌స్ట్రాగామ్‌లో ఏడున్నర కోట్లు ఫాలోవర్లు కలిగిన తొలి ఆసియా సెలెబ్రిటీ
 ఎప్పుడు  : ఆగస్టు 26
 ఎవరు  : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి
Published date : 29 Aug 2020 11:59AM

Photo Stories