ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ డాష్‌బోర్డ్ ప్రారంభం
Sakshi Education
దేశవ్యాప్తంగా అమలవుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమాచారం అంతా ఒకే చోట లభించేలా జాతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ఆన్లైన్ డ్యాష్‌బోర్డు అందుబాటులోకి వచ్చింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 10న ఈ డ్యాష్‌బోర్డును ప్రారంభించారు. స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్య సాధనకు ఇది తోడ్పడగలదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ గ్రిడ్ (ఐఐజీ)లోని ఎన్ఐపీ ద్వారా ప్రాజెక్టుల అప్‌డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు లభిస్తుందని వివరించారు.
అమల్లో 40 శాతం...
రూ. 111 లక్షల కోట్ల ఇన్ఫ్రా పెట్టుబడులకు సంబంధించి ప్రస్తుతం రూ. 44 లక్షల కోట్ల (సుమారు 40 శాతం) ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. రూ. 33 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రతిపాదన స్థాయిలో ఉన్నాయి. మిగతావి వివిధ స్థాయిల్లో ఉన్నాయి.
బీఎస్‌ఈ స్టార్ ఎంఎఫ్ పోర్టల్
కార్పొరేట్లు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుగా బీఎస్‌ఈ స్టార్ ఎంఎఫ్ కార్ప్ డైరెక్ట్ పేరుతో ప్రత్యేక పోర్టల్ ను అభివృద్ధి చేసింది. అస్సెట్ మేనేజ్ మెంట్ కంపెనీలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఇన్వెస్టర్లకు, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ భాగస్వాములకు ఎండ్ టు ఎండ్ సేవలను అందించడంతోపాటు, పెట్టుబడుల ప్రక్రియను ఇది సులభతరం చేస్తుందని బీఎస్‌ఈ ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ఆన్ లైన్ డ్యాష్‌బోర్డు ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు :కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎందుకు :మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమాచారం అంతా ప్రజలకు ఒకే చోట లభించేలాఅమల్లో 40 శాతం...
రూ. 111 లక్షల కోట్ల ఇన్ఫ్రా పెట్టుబడులకు సంబంధించి ప్రస్తుతం రూ. 44 లక్షల కోట్ల (సుమారు 40 శాతం) ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. రూ. 33 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రతిపాదన స్థాయిలో ఉన్నాయి. మిగతావి వివిధ స్థాయిల్లో ఉన్నాయి.
బీఎస్‌ఈ స్టార్ ఎంఎఫ్ పోర్టల్
కార్పొరేట్లు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుగా బీఎస్‌ఈ స్టార్ ఎంఎఫ్ కార్ప్ డైరెక్ట్ పేరుతో ప్రత్యేక పోర్టల్ ను అభివృద్ధి చేసింది. అస్సెట్ మేనేజ్ మెంట్ కంపెనీలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఇన్వెస్టర్లకు, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ భాగస్వాములకు ఎండ్ టు ఎండ్ సేవలను అందించడంతోపాటు, పెట్టుబడుల ప్రక్రియను ఇది సులభతరం చేస్తుందని బీఎస్‌ఈ ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ఆన్ లైన్ డ్యాష్‌బోర్డు ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు :కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Published date : 11 Aug 2020 05:40PM