ఇన్ఫోసిస్ కొనుగోలు చేయనున్న అమెరికా సంస్థ పేరు?
Sakshi Education
అమెరికాకు చెందిన ప్రోడక్ట్ డిజైన్, డెవలప్‌మెంట్ సంస్థ కెలీడోస్కోప్ ఇన్నోవేషన్‌ను కొనుగోలు చేయనున్నట్లు దేశీ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సెప్టెంబర్ 3న వెల్లడించింది.
ఈ డీల్ విలువ దాదాపు సుమారు 42 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 308 కోట్లు) దాకా ఉంటుందని పేర్కొంది. తమ అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ నోవా హోల్డింగ్‌స ద్వారా కెలీడోస్కోప్ కొనుగోలు జరుగుతుందని ఇన్ఫోసిస్ తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కాగలదని వివరించింది. మైక్రోసర్జికల్ సాధనాలు, శస్త్రచికిత్సలో ఉపయోగించే సాధనాలు మొదలైనవి కెలీడోస్కోప్ రూపొందిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కెలీడోస్కోప్ ఇన్నోవేషన్‌ను కొనుగోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : ఇన్ఫోసిస్
క్విక్ రివ్యూ :
ఏమిటి : కెలీడోస్కోప్ ఇన్నోవేషన్‌ను కొనుగోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : ఇన్ఫోసిస్
Published date : 04 Sep 2020 05:28PM