ఇన్ఫెక్షన్ రానివ్వని వస్త్రం అభివృద్ధి
Sakshi Education
ఆస్పత్రుల్లో అంటువ్యాధులు (ఇన్ఫెక్షన్లు) సోకకుండా రక్షణ కల్పించే వస్త్రాన్ని ఐఐటీ ఢిల్లీలో ఏర్పాటైన అంకుర సంస్థ ‘ఫాబియోసిస్ ఇన్నోవేషన్స్’అభివృద్ధి చేసింది.
‘కాటన్ రోల్స్ తీసుకుని సొంతంగా అభివృద్ధి చేసిన రసాయనాలతో శుద్ధి చేసి, ప్రస్తుత టెక్స్‌టైల్ మెషిన్లతోనే వస్త్రాన్ని రూపొందించాము. దీంతో ఇది సూక్ష్మ క్రిములను ఎదుర్కొనే విధంగా తయారైంది’ అని మార్చి 27న సంస్థ వెల్లడించింది.
గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్
కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మార్చి 27న సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజలను చైతన్య పరిచే విషయాల్లో చొరవతీసుకోవాలని వారికి సూచించారు.

Published date : 28 Mar 2020 06:43PM