ఇంటర్‌నెట్ వినియోగంలో భారత్ రెండో స్థానం
Sakshi Education
ఇంటర్‌నెట్ వినియోగంలో భారత్ రెండో స్థానంలో నిలిచింది.
యూజర్ బేస్‌లో ప్రపంచవ్యాప్తంగా 12 శాతం వాటాతో ఇండియా 2వ స్థానంలో ఉందని ‘2019 మారీ మీకర్’ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. ఇంటర్‌నెట్ ట్రెండ్‌సపై రూపొందించిన ఈ నివేదిక ప్రకారం అమెరికా వెలుపల జరిగిన అత్యంత వినూత్నమైన ఇంటర్‌నెట్ కంపెనీగా ‘రిలయన్స్ జియో’ నిలిచింది. ఈ కంపెనీ చొరవతోనే భారత్‌లో ఇంటర్‌నెట్ వినియోగం గణనీయంగా పెరిగినట్లు మారీ మీకర్ రిపోర్ట్ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం ఇంట్‌ర్‌నెట్ వినియోగంలో 21 శాతం వాటాతో చైనా మొదటిస్థానంలో ఉండగా... 8 శాతం వాటాతో అమెరికా మూడో స్థానం పొందింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్‌నెట్ వినియోగంలో భారత్‌కు రెండో స్థానం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : 2019 మారీ మీకర్ రిపోర్ట్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్‌నెట్ వినియోగంలో భారత్‌కు రెండో స్థానం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : 2019 మారీ మీకర్ రిపోర్ట్
Published date : 13 Jun 2019 05:48PM