ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్‌కు 128వ ర్యాంకు
Sakshi Education
మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్‌కు 128వ ర్యాంకు దక్కింది.
అలాగే ఫిక్సిడ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో భారత్ 72వ స్థానంలో నిలిచింది. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ విశ్లేషణ సంస్థ ఊక్లా.. 2019, సెప్టెంబర్ నెలకు గాను నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం అంతర్జాతీయంగా సగటు డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌లో దక్షిణ కొరియా అగ్రస్థానంలో ఉంది. భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక 81వ ర్యాంకు, పాకిస్తాన్ 112వ స్థానం, నేపాల్ 119వ ర్యాంకుల్లో ఉన్నాయి. ద్వితీయ, తృతీయ త్రైమాసికాల్లో భారత్‌లో 11 పెద్ద నగరాల్లో ఎయిర్‌టెల్ వేగవంతమైన మొబైల్ నెట్ ఆపరేటరుగా అగ్రస్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్‌కు 128వ ర్యాంకు
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ విశ్లేషణ సంస్థ ఊక్లా
ఎక్కడ : ప్రపంచంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్‌కు 128వ ర్యాంకు
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ విశ్లేషణ సంస్థ ఊక్లా
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 05 Nov 2019 05:38PM