Skip to main content

ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఇంటర్నెట్ ప్రజల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ-బిజినెస్ నిర్వహించడం ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ద్వారా ఎక్కువగా జరుగుతోందని, ఆ సేవల్ని నిరవధికంగా నిలిపివేయకూడదని స్పష్టం చేసింది.
Current Affairsజమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత ఇంటర్నెట్ తదితరాలపై విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.

‘జమ్మూకశ్మీర్-ఇంటర్నెట్’ పిటిషన్లను విచారించిన జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం జనవరి 10న తీర్పు వెలువరించింది. కశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షల్ని వారంలోగా సమీక్షించాలని కశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది. అత్యవసర సేవలైన ఆసుపత్రులు, విద్యాసంస్థలతో పాటుగా ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఈ బ్యాంకింగ్ రంగంలో ఇంటర్నెట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించింది.

ఆర్టికల్ 19(1)
భావప్రకటనా స్వేచ్ఛ, ఏదైనా వృత్తిని చేపట్టే స్వేచ్ఛ, ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యాపార లావాదేవీలన్నింటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 19(1)(జీ) రక్షణ కల్పిస్తోందని జస్టిస్ ఎన్వీ రమణ తన 130 పేజీల తీర్పులో పేర్కొన్నారు.

మాదిరి ప్రశ్నలు

1. 2019, అక్టోబర్ 31న కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన లదాఖ్ రాజధాని ఏది?
 1. లెహ్
 2. శ్రీనగర్
 3. జమ్మూ 
 4. కార్గిల్

Published date : 11 Jan 2020 06:45PM

Photo Stories