Skip to main content

ఇంద్రనేవీ పేరుతో నేవీ విన్యాసాలు నిర్వహించిన దేశాలు?

ఇంద్రనేవీ-2020 పేరుతో భారత్, రష్యా నావికాదళాలు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి.
Current Affairs
భవిష్యత్ ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ, పరస్పర రక్షణ ఒప్పందాలు పటిష్టం చేయడంలో భాగంగా బంగాళాఖాతం సముద్రంలో సెప్టెంబర్ 4, 5 తేదీల్లో ఈ విన్యాసాలను నిర్వహించారు. ఈ విన్యాసాల్లో భారత్ నావికాదళానికి చెందిన క్షిపణి విధ్వంసక నౌకలు రన్‌విజయ్‌శక్తి, ఆర్‌యూఎఫ్‌ఎన్ నౌకలు పాల్గొన్నాయి. క్రాస్‌డెక్ ఫ్లయింగ్, ఫైరింగ్, తదితర విన్యాసాలు విజయవంతంగా నిర్వహించారు. ఇంద్ర పేరుతో 2003 ఏడాది నుంచి భారత్, రష్యాలు నేవీ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా 11వ ఎడిషన్ విన్యాసాలను విజయవంతంగా పూర్తి చేశాయి. భారత్-చైనా సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్-రష్యా నౌకలు తమ యుద్ధప్రావీణ్యం పరీక్షించుకోవడం ప్రాధాన్యత సంతరించకుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఇంద్రనేవీ-2020 పేరుతో నేవీ విన్యాసాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 4, 5
ఎవరు : భారత్, రష్యా నావికాదళాలు
ఎక్కడ : బంగాళాఖాతం సముద్రం
ఎందుకు : భవిష్యత్ ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ, పరస్పర రక్షణ ఒప్పందాలు పటిష్టం చేయడంలో భాగంగా
Published date : 07 Sep 2020 05:42PM

Photo Stories