Skip to main content

ఇండోనేషియాలో రామాయణ స్టాంపు విడుదల

ఇండోనేషియాలో రామాయణ ఇతివృత్తంతో ప్రత్యేక స్టాంపును విడుదల చేశారు.
భారత్-ఇండోనేషియా మధ్య 70 ఏళ్ల దౌత్య సంబంధాలను పురస్కరించుకొని ఏప్రిల్ 24న ఇండినేషియా ప్రభుత్వం ఈ స్టాంపును విడుదల చేసింది. రామాయణంలో సీతను రావణుడి బారి నుంచి రక్షించేందుకు జటాయువు చేసిన పోరాటాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఈ స్టాంపును రూపొందించారు. ప్రముఖ ఇండోనేషియా శిల్పకారుడు పద్మశ్రీ బాపక్ న్యోమన్ నుఅర్తా ఈ స్టాంపును రూపొందించాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రామాయణ స్టాంపు విడుదల
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : ఇండోనేషియా ప్రభుత్వం
ఎక్కడ : ఇండోనేషియా
ఎందుకు : భారత్-ఇండోనేషియా మధ్య 70 ఏళ్ల దౌత్య సంబంధాలను పురస్కరించుకొని
Published date : 25 Apr 2019 05:15PM

Photo Stories