ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేత?
Sakshi Education
భారత చెస్ స్టార్, ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపికి ప్రతిష్టాత్మక బీబీసీ క్రీడా అవార్డుల పురస్కారం దక్కింది.
బీబీసీ వార్షిక అవార్డుల్లో హంపి ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్–2020’గా ఎంపికైంది. ఈ విభాగంలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్, స్ప్రింటర్ ద్యుతీ చంద్, షూటర్ మనూ భాకర్, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్లతో పోటీ పడిన తెలుగు తేజం హంపి తుది విజేతగా నిలిచింది. అభిమానుల ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయించారు. అవార్డుల ప్రకటన కార్యక్రమాన్ని మార్చి 8న ‘వర్చువల్’గా బీబీసీ నిర్వహించింది.
అంజూకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్...
వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటి వరకు పతకం గెలిచిన ఏకైక భారత అథ్లెట్ అయిన అంజూ జార్జ్‌కు ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు... షూటర్ మనూ భాకర్‌కు ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించాయి.
2019లో ప్రారంభం...
భారత క్రీడారంగంలోని అత్యుత్తమ క్రీడాకారిణులకు తగిన గుర్తింపునిస్తూ 2019 ఏడాదిలో వార్షిక అవార్డులను బీబీసీ ప్రారంభించగా... బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు తొలి విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్–2020 అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : కోనేరు హంపి
ఎందుకు : క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు

Published date : 09 Mar 2021 07:23PM