ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సీఈఓగా నియమితులైన వారు?
Sakshi Education
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా.. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్‌స బ్యాంక్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జే వెంకట్రాము జనవరి 7న బాధ్యతలు స్వీకరించారు.
చెల్లింపులు, ఉత్పత్తులు, అనుబంధ సాంకేతిక వ్యవస్థల మీద ఈయనకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2002-2015 మధ్య యాక్సిస్ బ్యాంక్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా, ఆరేళ్ల పాటు భారత వైమానిక దళంలోనూ వెంకట్రాము పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఎండీ, సీఈఓగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : జే వెంకట్రాము
Published date : 08 Jan 2021 06:40PM