Skip to main content

ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ వాయిదా

టోక్యో ఒలింపిక్స్‌ అర్హత టోర్నీలలో ఒకటైన ఇండియా ఓపెన్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ప్రకటించింది.
Current Affairs
కరోనా ఉధృతి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్‌ 19న తెలిపింది. ఈ టోర్నీ న్యూఢిల్లీ వేదికగా 2021, మే 11 నుంచి 16 వరకు జరగాల్సింది. కరోనా కారణంగానే 2020 ఏడాది కూడా ఇండియా ఓపెన్‌ నిర్వహణ సాధ్యంకాలేదు.

బోరిస్‌ భారత పర్యటన రద్దు..
బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తన భారత భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. భారత్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్‌ 19న వెల్లడించారు. ఆయన వచ్చే వారం భారత్‌కు రావాల్సి ఉంది. తాజా నిర్ణయంతో ఆ పర్యటన రద్దైంది. దీనికి ముందు 2021 గణతంత్ర దినోత్సవ వేడుకలకే ఆయన రావాల్సి ఉండగా, అప్పుడు బ్రిటన్‌లో కరోనా తీవ్రంగా ప్రబలి ఉండటంతో రాలేకపోయారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఇండియా ఓపెన్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ వాయిదా
ఎప్పుడు : ఏప్రిల్‌ 19
ఎవరు : భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశంలో కరోనా ఉధృతి పెరగడంతో..
Published date : 20 Apr 2021 06:16PM

Photo Stories