ఇండియా కోవిడ్ రెస్పాన్స్ ఫండ్ ప్రారంభం
Sakshi Education
విరాళాల ప్లాట్‌ఫార్మ్ ‘గివ్ ఇండియా’ రూ.75 కోట్ల ఆరంభ విరాళంతో ‘ఇండియా కోవిడ్ రెస్పాన్స్ ఫండ్’ను (ఐసీఆర్‌ఎఫ్) ప్రారంభించింది.
కరోనా కల్లోలానికి కుదేలవుతున్న వారిని ఆదుకోవడానికి ఐసీఆర్‌ఎఫ్‌ను ప్రారంభించామని గివ్ ఇండియా ఏప్రిల్ 14న తెలిపింది. కనీసం కోటిమందికైనా సాయమందించాలనేది తమ లక్ష్యమని పేర్కొంది. బిల్‌గేట్స్‌కు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, గూగుల్.ఓఆర్‌జీ, హెచ్‌ఎస్‌బీసీ ఇండియా, మ్యారికో, ఉబెర్ ఇండియా తదితర సంస్థలు విరాళాలు అందజేశాయని గివ్ ఇండియా డైరెక్టర్ గోవింద్ అయ్యర్ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియా కోవిడ్ రెస్పాన్స్ ఫండ్ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : గివ్ ఇండియా
ఎందుకు : కరోనా కల్లోలానికి కుదేలవుతున్న వారిని ఆదుకోవడానికి
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియా కోవిడ్ రెస్పాన్స్ ఫండ్ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : గివ్ ఇండియా
ఎందుకు : కరోనా కల్లోలానికి కుదేలవుతున్న వారిని ఆదుకోవడానికి
Published date : 15 Apr 2020 06:52PM